క‌డ‌ప‌లో డిఎస్‌సి-98 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌

క‌డ‌ప (CLiC2NEWS): న‌గ‌రంలోని డిఇఒ కార్యాల‌యం ఎదుట డిఎస్‌సి-98 అభ్య‌ర్థులు ఆందోళ‌న‌కు దిగారు. జిల్లా వ్యాప్తంగా 580 మంది అభ్య‌ర్థులు అర్హులైతే.. 172 మందికి మాత్ర‌మే నియామ‌కాలు చేప‌ట్ట‌డ‌మేమిట‌ని.. అర్హులైన వారంద‌రికీ ఉద్యోగాలివ్వాల‌ని ఆందోళ‌న చేప‌ట్టారు. డిఎస్‌సి -98 అభ్య‌ర్థులంద‌రికీ ఉద్యోగాలు ఇస్తాన‌న్న‌ సిఎం జ‌గ‌న్.. ఇపుడు కొంత‌మందికి మాత్ర‌మే నియామ‌కాలు చేప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అర్హులంద‌రికీ ఉద్యోగాలివ్వాల‌ని ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా డిఇఒ రాఘ‌వ‌రెడ్డికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

Leave A Reply

Your email address will not be published.