నీటిలో మునిగిన చిన్నారుల‌ను కాపాడ‌బోయి..

నారాయ‌ణ‌పేట (CLiC2NEWS): బోయిన‌ప‌ల్లి  చెరువులోకి ఈత‌కు దిగిన‌ చిన్నారుల‌ను కాపాడ‌బోయి మ‌హిళ సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న నారాయ‌ణ‌పేట జిల్లాలోని బోయిన్‌ప‌ల్లిలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ్రామ‌నికి చెందిన లిఖిత‌, విజ‌య్, వెంక‌టేష్ చెరువులోకి ఈత‌కు వెళ్లారు. ప్ర‌మాద‌వ‌శాత్తూ.. నీటిలో మునిగిపోతుండ‌గా.. వారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించిన విజ‌య్ త‌ల్లి కూడా నీటిలో మునిగి మృత్యువాత ప‌డింది. వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.