దారుణం.. రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ విద్యార్థి మృతి
వరంగల్ (CLiC2NEWS): వరంగల్ కాశీ బుగ్గకు చెందిన ఓ బాలుడు రెండు బస్సుల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన చరణ్.. స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం వరంగల్ బస్టాండ్‌కు వచ్చాడు. ఒక బస్సు ముందునుంచి నడుస్తుండగా.. మరో బస్సు వెనుకకు వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలుడు రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాలుడి కుటుంబ సభ్యులు బస్టాండులో ఆందోళనకు దిగారు. కర్రలతో బస్సుల అద్దాటు పగలగొట్టటానికి ప్రయత్నించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.