ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/AP-GENCO-THERMAL-POWER.jpg)
నెల్లూరు (CLiC2NEWS): జిల్లాలోని ముత్తుకూరు మండలంలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురువారం మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు . వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్‌లోని సిసిఆర్ కంట్రోల్ రూమ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ బ్రేకర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విద్యుత్ కేంద్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.