ఉచితంగా సమ్మర్ స్పెషల్ ఆన్‌లైన్ యోగ!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/yoga-750x430.jpg)
ఖమ్మం (CLiC2NEWS): ఉచితంగా అందరికీ ఆన్లైన్ (జూమ్ క్లాసెస్) ద్వారా యోగ, ప్రాణయామం,ఆయుర్వేద శిక్షణ తరగతులను నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
యోగా గురువు షేక్ బహర్ అలీ,B.A.M.S ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో సమ్మర్ ప్రత్యేక యోగా తరగతులను నిర్వహించనున్నారు. ఈ ఆన్‌లైన్‌లో యోగా శిక్షణను ఈనెల (మే) 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ఈ సెల్ ఫోన్ నెంబరు 7396126557ను సంప్రదించగలరని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యోగా సైన్స్ వర్క్ షాప్ లో యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం శిక్షణ తరగతులు నేర్పబడునని నిర్వాహకులు పేర్కొన్నారు..