‘బలగం’ మొగిలయ్యకు దళిత బంధు మంజూరు
నర్సంపేట (CLiC2NEWS): ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మొగిలయ్యకు దళితబంధు పథకం మంజూరు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం దళితబంధు. ఈ పథకంతో అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. తాజాగా బలగం మొగిలయ్యకు దళిత బంధు పథకాన్ని రాష్ట్ర సర్కార్ మంజూరు చేసింది. బలగం చిత్రంలో మొగిలయ్య తన గానంతో అందరికి సుపరిచితుడయ్యాడు. ఈ చిత్రంలో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగభరితమైన పాటను ఆలపించిన విషయం తెలిసిందే ఇటీవల మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. రాష్ట్ర సర్కార్ అదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి మొగిలయ్య కుటుంబానికి దళితబంధు మంజూరు చేశారు. ఈ సందర్బంగా మొగిలయ్య దంపతులను సన్మానించారు.