వైకల్యం వచ్చిందని ఉద్యోగిని కొలువునుండి తొలగించొద్దు: ఎపి సర్కార్
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/AP-NEW-LOGO.jpg)
అమరావతి (CLiC2NEWS): సర్వీసులో ఉండగా వైకల్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలంగించరాదని ఎపి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి వివిధ రకాల కారణాల చేత వైకల్యానికి గురైతే అతనిని సర్వీసు నుండి తొలగించవద్దని.. అతనికి వీలుగా ఉండే మరో పోస్టులో నియమించాలని సర్కార్ తెలిపింది. అటువంటి ఉద్యోగి పనిచేయడానికి వీలుగా పోస్టు లేకపోతే.. అదే శాఖ పరిధిలో ప్రత్యేక పోస్టును సృష్టించాలని పేర్కొంది.
దివ్యాంగుల హక్కుల చట్టం- 2016 లోని సెక్షన్ 20 (4) ను అన్ని శాఖలూ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పోస్టులో నియమించి .. సదరు ఉద్యోగి హోదా, జీత భత్యాలు, ఇతర ప్రయోజనాల్లోననూ ఎలాంటి తగ్గింపు ఉండకూడదని పేర్కొంది. ఆ ఉద్యోగికి పదోన్నతి కూడా క్రమం తప్పకుండా అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.