చిన్న వయస్సులోనే చదరంగంలో గ్రాండ్ మాస్టర్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/CHESS-GRAND-MASTER.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నల్గొండ జిల్లాకు చెందిన ఉప్పల్ ప్రణీత్‌కు శిక్షణ ఖర్చుల నిమిత్తం సిఎం కెసిఆర్ రూ. 2.5 కోట్ల సాయం ప్రకటించారు. చెస్ క్రీడాకారులు ప్రణీత్, వీరపల్లి నందిని సిఎంను కలిశారు. ప్రణీత్‌ను సిఎం దీవించి.. శిక్షణ ఖర్చుల కోసం రూ. 2.5 కోట్ల సాయం ప్రకటించారు. చిన్న వయస్సులో చదరంగంలో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ మాస్టర్ కావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా వీరవల్లి నందినికి శిక్షణ ఖర్చుల కోసం రూ. 50 లక్షలు ప్రకటించారు. సిఎం వారిద్దరిని అభినందించి.. రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.