పది పాసైతే.. తపాలా శాఖలో 12,828 పోస్టులు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/jobs-notification-copy-750x313.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా.. ఈ పోస్టులు భర్తీ చేస్తారు. మెరిట్ ఆధారంగా బ్రాంచ్ పోస్టు మాస్టర్ బిపిఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఎబిపిఎం పోస్టుల నియామకం చేపట్టనున్నారు. ఈ పోస్టులకు పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
మొత్తం 12,828 పోస్టులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 118, తెలంగాణలో 96 చొప్పున పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 11, 2023 నాటికి 18 – 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి లకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 22 వ తేదీనుండి జూన్ 11తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.