గుంటూరులో రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
గుంటూరు (CLiC2NEWS): గుంటూరు జిల్లాలో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం పొత్తూరు నాయుడు పేట ప్రాంతంలో ఆగి ఉన్న లారీ మరో లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదాని గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.