దారుణ హత్య :ప్రేమ వ్యవహరమే కారణం!?

 వీణవంక(కరీంనగర్): మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి నరుకుడు ప్రణయ్‌ (24) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రేమికురాలి కుటుంబీకులు హత్య చేసి ఉంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు మొగిలి, పద్మ కూలీలుగా పని చేస్తూ పొట్ట పోసుకుంటుండగా.. ప్రణయ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌.. అదే గ్రామంనికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ప్రణయ్‌కి ఫోన్‌ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. అమ్మాయి బంధువులే తమ కుమారుడిని హత్య చేసి ఉంటారని, ఎక్కడో హత్య చేసి.. మృతదేహాన్ని తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్మికుంట రూరల్‌, టౌన్‌ సీఐలు రాములు, సృజన్‌రెడ్డి, వీణవంక ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు సదరు యువతితో పాటు కుటుంబీకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, యువతి కుటుంబ సభ్యులే ప్రణయ్‌ని హత్య చేసి ఉంటారని, ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.