28 రైళ్లు.. వారం రోజుల పాటు రద్దు..!
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్, సికిందరాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనులు చేపట్టనున్నందున దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. జూన్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు.. వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్ల సర్వీసులను రద్దు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అంతే కాకుండా హైదరాబాద్ జంటనగరాల్లో సేవలందించే 23 ఎంఎంటిఎస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.