త‌మిళ‌నాడు సినీనిర్మాత‌ల మండ‌లి కీల‌క నిర్ణ‌యం..

ఐదుగురు న‌టుల‌కు త్వ‌ర‌లో నోటీసులు..

చెన్నై (CLiC2NEWS): షూటింగ్‌కు స‌హ‌క‌రించ‌ని న‌టుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు త‌మిళ‌నాడు చిత్ర నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యించింది. ఎన్‌. రామ‌స్వామి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో కోలీవుడ్ నిర్మాత‌ల మండ‌లి కొన్ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిర్మాత‌ల‌కు స‌హ‌క‌రించని ఐదుగురు న‌టుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా ఆ ఐదుగురు న‌టుల‌తో సినిమాలు చేయాల‌నుకుంటే ముందు త‌మ దృష్టికి తీసుకురావాల‌ని ప్రొడ్యూస‌ర్స్‌కు తెలిపింది. వారికి త్వర‌లో నోటీసులు కూడా పంప‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆ ఐదుగురు న‌టులు ఎవ‌ర‌నే విష‌యం వెల్ల‌డించ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.