నో వ‌ర్క్.. నో పే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతంలో కోత‌.. మ‌ణిపూర్ స‌ర్కార్‌

మ‌ణిపుర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..

ఇంఫాల్ (CLiC2NEWS): మ‌ణిపుర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు విధుల‌కు స‌రిగా హాజ‌రు కాక‌పోతే.. జీతంలో కొత విధించాల‌ని రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యించింది. అనుమ‌తి లేకుండా సెల‌వు తీసుకొని విధుల‌కు హాజ‌రుకాని ప‌క్షంలో వారికి జీతాలు చెల్లించ‌కూడ‌ద‌ని కొత్త నిబంధ‌న‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ఈ మేర‌కు ఉద్యోగుల గైర్హాజ‌రు వివ‌రాల‌ను సిద్దం చేయాల‌ని ప్ర‌భుత్వం జిఎడికి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన జ‌రిగిన సిఎం బీరేన్ సింగ్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖ‌ల్లో సుమారు ల‌క్ష మంతి ఉద్యోగులు విధులు నిర్వ‌హిస్తున్నారు. మ‌ణిపూర్‌లో గ‌త నెల రోజులుగా నెల‌కొన్న హింస కార‌ణంగా కొంద‌రు ఉద్యోగులు విధుల‌కు హాజ‌రుకాలేక‌పోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ణిపుర్‌లో కొన్నాళ్లుగా అల్ల‌ర్లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. జాతుల మ‌ధ్య కొన‌సాగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.