ఏడిద సీతా నగరంలో పారిశుధ్యం అధ్వాన్నం

మండపేటః తూర్పుగోదావరి జిల్లాలో ని మండపేట మండలం ఏడిద సీతా నగరంలో పారిశుధ్యం అధ్వాన్నం. ఎక్కడి చెత్త అక్కడే…ఏడిద సీతానగరం లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నివాసాల్లో ఉన్న తడి చెత్త, పొడి చెత్త కూడా పేరుకు పోయింది.ముఖ్యంగా అంకాలమ్మ గుడి వీధి లో చెత్తను తీసుకు ని వెళ్ళేవారు కరువై పోయారు. పారిశుధ్య కార్మికులపై సరైన అజమాయిషీ గ్రామ పంచాయతీ కి లేని కారణంగా గ్రామంలో పారిశుధ్యం క్షీణించిందని గ్రామస్తులు వాపోతున్నారు.