ఐదుగురు మెగా హీరోలు.. 4 సినిమాలు

హైదరాబాద్ (CLiC2NEWS): నెల రోజుల వ్యవధిలో 4 సినిమాలతో.. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు మెగా హీరోలు సందడి చేయబోతున్నారు. ఈ నెల చివరి వారం నుండి మెగా జాతర షురూ కానుంది. ఈ మెగా హీరోల్లో ముందుగా మామ అల్లుళ్ల చిత్రం బ్రో విడుదలకానుంది. పవన్‌కల్యాణ్-సాయిథరమ్ తేజ్ నటించిన బ్రో నుండి రిలీజైన టీజర్, పాటలు భారీ అంచనాలను రేకిస్తున్నాయి. ఇక దీని తర్వాత భోళా శంకర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్నా కథానాయికగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రంలో సుశాంత్, కీర్తి కూడా ప్రధాన పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి దాదాపు రెండువందల యాభైకోట్ల కలెక్షన్లతో విజయం అందుకుంది.
తర్వాత శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆగస్టు చివరి వారంలో మెగా ఫ్రిన్స్ వరణ్ తేజ్ గాంఢీవదారి అర్జున సినిమా రానుంది. ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో ఈ చిత్రం సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 25న రిలీజ్ కానుంది.