కాంగ్రెస్‌లోకి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Theegala-krishna-reddy.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తీగల కృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. హైదరబాద్ నగర మేయర్‌గా ఆయన పనిచేశారు. అనంతరం హైదరబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో మొదటి సారిగా మహేశ్వరం నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో మళ్లా సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సబితా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి.. బిఆర్ ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు.