హుస్సేన్ సాగర్‌కు భారీగా వరదనీరు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/floods-water-in-hussain-sagar.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో నాలుగు నాలుగు రోజుల నుండి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్‌కు చేరింది. నిండుకుండలా సాగర్ కనిపిస్తుంది. సాగర్ నీటి మట్టం పుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా.. ప్రస్తుతం 514.75 మీటర్లకు చేరింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలెవ్వరూ అవసరముంటే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.