కుక్కకాటుకు గురై ఆరు నెలల తర్వాత రాబిస్ సోకి ఇద్దరు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/STREET-DOGS.jpg)
కాకినాడ (CLiC2NEWS): వీధుల్లో కుక్కుల స్వైర విహారంతో ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడుతున్నారు. ఆరు నెలల క్రితం కుక్క కాటుకు గురైన యువకుడు ఆరు నెలల తర్వాత తాజాగా రాబిస్ బారిన పడి మృతి చెందాడు. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గం గొల్ల ప్రోలులో చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం అమినా బాద్‌కు చెందిన బాణయ్య అనే వ్యక్తి మూడు నెలల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. అతను వ్యాక్సిన్ వేయించుకున్నా గానీ.. తాజాగా రాబిస్ సోకి మృతి చెందడంతో గ్రామంలోని వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే.. బాణయ్యను కరిచిన కుక్కే మరో 14 మందిన కరిచినట్లు సమాచారం. దీంతో కొత్తపల్లి పిహెచ్‌సి వైద్యలు ఆ 14 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి అబ్జర్వేషనల్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.