AP: వైఎస్ఆర్‌సిపిపై ప్రశ్నాస్త్రాలు సంధించిన బిజెపి..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Vishnu-varthan-reddy-bjp.jpg)
విజయవాడ (CLiC2NEWS): భారతీయ జనతాపార్టీ వైఎస్ఆర్‌సిపిపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఆధికార పార్టీ నాలుగేళ్ల పాలనపై తొమ్మిద ప్రశ్నలకు జవాబులు చెప్పాలని బిజెపి పార్టీ నేత విష్టువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అడిగిన ప్రశ్నలకు వైఎస్ ఆర్‌సిపి సమాధానాలు చెప్పకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని వ్యక్తిగతంగా విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విమర్శించేముందు మంత్రులు ఆయా శాఖలకు ఏం పనులు చేశారో.. ఎంత వరకు చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.