నాయినికి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు ప‌రామ‌ర్శించారు. బుధ‌వారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి వెళ్లారు. ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను కేసీఆర్ కోరారు.  నిమోనియాతో బాధపడుతున్న నాయినికి వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. 15 రోజుల క్రితం నాయినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో కుదుటపడుతున్న ఆయనకు తిరిగి నిమోనియా సోకింది. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో ఈ నెల 13న‌ దవాఖానకు తరలించారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఇప్పటికే నాయిని నరసింహారెడ్డిని పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.

 

Leave A Reply

Your email address will not be published.