నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి దరఖాస్తులకు గడువు పొడిగింపు
ఢిల్లీ (CLiC2NEWS): నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 10వ తేదీతో గడువు ముగియనుండటంతో మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలో మొతత్ం 649 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణ రాష్ట్రంలో 9 చొప్పున ఉన్నాయి. వీటిలో 6వ తరగతి సీట్లను భర్తీ చేయడానికి రెండు దశల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 4 వ తేదీన ఉదయం 11.30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లోను, 2024 జనవరి 20వ తేదీన తెలు రాష్ట్ఆలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.