పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో దంపతులు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/WIFE-AND-HUSBAND-SUICIDE-ATTEMPT.jpg)
జనగామ (CLiC2NEWS): జిల్లాలోని నర్మెట్ట మండలంలో భార్య భర్తలు సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు యత్నించారు. సూర్య బండ తండాకు చెందిన దంపతులకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని ఇతరులు ఆక్రమించడంతో మనస్తాపానికి గురై ఆత్య హత్యకు యత్నించినట్లు సమాచారం. తమకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిరువురిని జిల్ల ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యం అందిస్తున్నారు.