బిజెపి, వైఎస్ఆర్‌సిపి పేరులో మాత్ర‌మే భిన్న‌మైన‌వ‌ని..

విజ‌య‌వాడ (CLiC2NEWS): బిజెపి, వైఎస్ఆర్‌సిపి పేరులో మాత్ర‌మే భిన్న‌మైన‌వ‌ని.. రెండు పార్టీలు క‌లిసే ఉన్నాయ‌ని సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. నారాయ‌ణ ఆరోపించారు. విజ‌య‌వాడ దాస‌రి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఎపి రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేశారు. ఆ నిర్మాణం ఆగిపోయినా దానిపై ఆయ‌న ఎందుకు నిల‌దీయ‌డంలేద‌ని ప్రశ్నించారు. బిఆర్ ఎస్‌, ఎపిలో వైఎస్ ఆర్‌సిపి ప్ర‌భుత్వాలు భార‌తీయ జ‌న‌తా పార్టీలో క‌లిసే ఉన్న‌యాన్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన శ‌త్రువు బిజెపినే అని నారాయ‌ణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.