మూసీ నదికి వరద ఉధృతి.. 100 ఫీట్ల రోడ్డు మూసివేత

హైదరాబాద్ (CLiC2NEWS): పురానాపూల్ నుండి లంగర్ హౌజ్ వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపైకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గం పై రాకపోకలు అధికారులు నిలిపివేశారు. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద ఉధృతి ఎక్కువైంది. వరద నీరు రోడ్డుపైన ప్రవహిస్తుండటంతో పురానాపూల్ వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేశారు.