హైదరాబాద్: బిజెపి బైక్ ర్యాలీ

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో భారతీయ జనతా పార్టీ శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించింది. సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమర వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని పోలీసుల అమరవీరుల స్మృతి స్థలి నుండి ప్రారంభమై హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.