రాజ్‌ఘాట్ వద్ద టిడిపి నేతల మౌనదీక్ష

ఢిల్లీ (CLiC2NEWS ): రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు మౌన దీక్ష చేపట్టారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు ఎంపిలు, మాజి ఎంపిలు రాజ్‌ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులు అర్పించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాజ్కాంగ వ్యతిరేక కార్యకలాపాలను రాజ్‌ఘాట్ నుండి దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఎపి సర్కార్ అవినీతిపాలనపై కేంద్రం జోక్కం చేసుకోవాలని.. ఎపిప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.