`నాగ్` ప్ర‌యోగం సక్సెస్

న్యూఢిల్లీ: సైన్యానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చడంలో డీఆర్డీఓ మరో అడుగు ముందుకేసింది. భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. డీఆర్‌డీఓ రూపొందించిన నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ చివరి దశ ట్రయల్స్‌ విజయవంతగా ముగిసింది. గురువారం ఉదయం 6:45 నిమిషాలకు డీఆర్‌డీఓ ఈ అస్త్రాన్ని ప్రయోగించి సక్సెస్ అయ్యింది. హెలికాఫ్టర్ ద్వారా ప్రయోగించే స్టాండ్‌ ఆఫ్ యాంటీ-ట్యాంక్ మిస్సైల్ (సాంట్) సక్సెస్ తర్వాత డీఆర్‌డీఓ నాగ్ క్షిపణిని రూపొందించడం విశేషం. సాంట్ క్షిపణి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. దీన్ని అక్టోబర్ 19వ తేదీన ఒడిషాలోని బాలాసోర్ టెస్టింగ్ రేంజ్ నుంచి ప్రయోగించారు.

(త‌ప్ప‌క‌చ‌ద‌వండి: నేడు నేవీలోకి ఐఎన్‌ఎస్‌ కవరట్టి)

సాంట్ క్షిపణిని భవిష్యత్తులో హెలికాఫ్టర్‌తోనే అనుసందానం చేయనున్నప్పటికీ… ప్రస్తుతం భూమి పై నుంచి నిర్వహించిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే సామర్థ్యంతో తయారు చేసిన “నాగ్” క్షిపణిని గురువారం డీఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది. థర్డ్ జనరేషన్ “యాంటీ ట్యాంకు గైడెడ్ మిసైల్ ” (నాగ్)ను మిసైల్ క్యారియర్ “నామిక” నుంచి ప్రయోగించారు. నాగ్ క్షిపణికిది చివరి ప్రయోగం.. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో భారీ ఎత్తున ఉత్పత్తి చేసి, భారత నావికా దళానికి అప్పగించనున్నట్లు డీఆర్డీఓ ఛైర్మెన్ సతీశ్ రెడ్డి వెల్లడించారు. అంతిమ ప్రయోగం విజయవంతం కావడంతో నాగ్ మిసైల్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు డీఆర్డీఓ రెడీ అవుతోంది. నాగ్‌ను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

 

Leave A Reply

Your email address will not be published.