తమిళనాడులో బస్సు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
![](https://clic2news.com/wp-content/uploads/2023/10/bus-accident-in-tamilnadu.jpg)
చెన్నై (CLiC2NEWS): తమిలనాడులో పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన బస్సు లోయలోపడి 8 మంది మృత్యువాత పడ్డారు. 54 మందితో తెన్ కాశి నుండి ఊటీకి వెళుతున్న బస్సు కొండమార్గంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. నీలగిరి జిల్లా కున్నూర్-మేట్టుపాలయం కొండమార్గంలోని చెక్క వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.