మధురాతి మధురమైన `తేనే` గురించి..

తేనె సంస్కృతంలో మధు,
హిందీలో షహత్,
తెలుగులో తేనె,
లాటిన్ హనీ అంటారు.

ప్రపంచంలో అత్యంత మధురమైనది, తీపి అయినది తేనె. దీనికి మించిన తీపిది ఏదీ లేదు అంటారు. తేనే చాలా అద్భుతం అమోహమైనటువంటి ఔషధాలు గుణగణాలు కలిగి ఉన్నది.. స్వచ్ఛమైన తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీని కొన్ని ఔషధాల్లో తయారీలో ఉపయోగిస్తారు. దీనిని ప్రత్యక్షంగా తీసుకోవచ్చును.

ఎక్కడైనా సరే స్వచ్ఛమైన తేనె దొరికితే దానిని చిటికెన వేలుతో జస్ట్ కొద్దిగా మనము నాలుక మీద పెట్టి నాకినట్లయితే నాలుక మీద ఉన్న రుచి మొగ్గలు మొత్తం చక్కగా ఆక్టివ్ అయిపోయి నర నరాలు మొత్తము రక్తప్రసరణ జరిగి చాలా చక్కగా స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి.

మధురమైనది తేనె, తేనె మధుర, రుక్ష,కషాయరసము శీతలము గుణములు కలిగి ఉండును.. ఇది దీపనము, వాజికరణము, హృద్యం, లేఖనము, గ్రాహి, వ్రణశోధనం, రోపణము, అనే కర్మలను కలిగి ఉండును.

తేనే త్రిదోషహారము.

తేనె పాతది సంవత్సరం దాటినది గ్రహీ లేఖన కర్మలను కలిగి ఉండును. ఇది క్రొవ్వుని తగ్గిస్తుంది.

కొత్త తేనే మధురంగా ఉండును బలాన్ని కలిగిస్తుంది.శ్లేష్మా హర గుణములను మరియు సర గుణములు కలిగి ఉండును.

తేనేలో అనేక రకాల పోషక విలువలున్నాయి.
డెక్రొట్జ్
లావిలోజ్
సూక్రోజ్ వున్నాయి.

ఎంజైములైన ఇన్ఫర్టెజ్, ఇన్లేజ్, లు వున్నాయి. తేనేలో ఏసిటిక్, పార్మిక్, మాలిక్, సిట్రిక్ ACIDS పోటాషియం,ఐరన్,కాపర్, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, విటమిన్ బి, B2, సి, నికోటిన్, ఆసిడ్, వున్నాయి.

తేనె తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు తగ్గిస్తుంది క్రిమి రోగాలు, నేత్రవ్యాధులు, రక్తపిత్తము, మరియు గొంతు సంబంధిత వ్యాధులు తగ్గిస్తుంది.

తేనేకు విరోచనం చేయించే గుణం కూడా ఉన్నది. ఇది ఆకలి లేని వారికి బలహీనులకు చాలా మంచిది. గుండె జబ్బు రోగులకు,, జ్వరాలతో బాధపడు రోగులకు మరియు రక్త గత శర్కర చాలా తక్కువగా ఉన్న రోగులకు, ఆపరేషన్ నుండి కోలుకున్న వారికి గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరం.

తేనే హృదయానికి మంచిది. నాడీ మండలానికి ఉత్తేజపరుస్తుంది. ఇది తొందరగా అబ్జర్వ్ అయి సత్వర శక్తిని,ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది శరీరానికి రక్తం పట్టేటట్టు చేస్తుంది. పసిపిల్లలకు ఎంతో ఉపయోగకరం పిల్లలకు నాలుక మీద పెట్టి నాకించినట్లయితే త్వరగా మాటలు రావడం జరుగుతుంది. చిన్నపిల్లలకు తేనే ఇవ్వటం వల్ల వాళ్లు ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది.ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి గలుగుతుంది దీనికి యాంటీసెప్టిక్ గుణాలు కూడా కలవు.

దీర్ఘకాలిక వ్రణాలు తొందరగా మాయం అవుతాయి.పాత తేనె నీటితో కలిపి తీసుకున్నట్లయితే అతి బరువు తగ్గుతారు

పక్షవాతం వచ్చిన వారికీ తేనె మంచిది.
తేనె నిమ్మరసం కలిపి తాగిన వడదెబ్బ నుండి కూడా రక్షణ కలుగుతుంది.

కొత్త తేనే నీళ్లలో కలిపి తాగితే బలము కలుగుతుంది జలుబు దగ్గు తగ్గుతుంది, నొప్పులన్నీ, మంటలు తగ్గుతాయి.


తేనే నిమ్మరసం మాల్ట్ వెనిగర్ కలిపి తాగితే తల తిప్పటం వాంతులు వచ్చినట్టైనా సరే అవి తగ్గిపోతాయి

తులసి రసాన్ని కలిపి తీసుకుంటే జలుబు గొంతు నొప్పి మరియు అస్తమా రోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది

తేనె రాత్రిపూట తీసుకుంటే చక్కని నిద్ర వస్తుంది.
దీని ముఖమునకు రాసి ముఖము కడుక్కున్న ముఖము వర్షస్సు పెరుగుతుంది.
తేనె పట్టు నుండి లభించిన మైనమును అనే ఔషధాల్లో ఆయింట్మెంట్స్ లో వాడుతారు.
తేనె నీరసాన్ని నిస్సత్తు ని తొలగిస్తుంది.

తేనే తీసుకుంటే మంచి సెక్స్ ఎంజాయ్ చేయగలుగుతారు.
తేనే పంచదార కలిపి తీసుకున్నట్లయితే దాహం చక్కగా తీరుతుంది అతిసారం తగ్గుతుంది శ్రమ తగ్గి ఉత్సాహం కలుగుతుంది
తేనే అధికంగా సేవించడం పనికిరాదు.
ఒకటి tea చెంచా అల్లం రసం 1 tea స్పూన్ తేనే కలిపి ప్రతి రోజు తీసుకున్నట్లయితే దగ్గు కఫం మొత్తం తగ్గుతుంది.
ఒకటి చెంచా తులసి రసము, ఒకటి చెంచా తేనె కలిపి ప్రతి రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది జలుబు, పడిసం, తగ్గుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ని ఒక టీ స్పూన్ అశ్వగంధ పౌడర్, తేనే కలిపి తీసుకుంటే రాత్రికి చక్కగా ఆరోగ్యవంతంగా మంచి నిద్ర పడుతుంది.

కొత్తగా గాయాలైనప్పుడు ఆ పుండు మీద మనం తేనె రాస్తే చాలా చక్కగా పుండు తగ్గుతుంది.
ఏదైనా బైక్ సైలెన్సర్ గాని వేడి ఇనప ముక్కలు గాని మనకు చేతి గాని తగిలి కాలినట్లయితే ఆ ప్రదేశంలో వెంటనే తినే రాసినట్లయితే పుండు త్వరగా మానుతుంది.

ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపితే ముఖ వర్చస్సు పెరుగుతుంది మరియు కంటికి చాలా చక్కగా ఉంటుంది ఏ విటమిన్ బాగా లభిస్తుంది సి విటమిన్ లభిస్తుంది. కంటి చూపు చక్కగా పెరుగుతుంది స్కిన్ సౌందర్యవంతంగా తయారవుతుంది
ముఖం మీద మొటిమలు తగ్గిపోతాయి.
ఉదయం అల్పాహారం లోని బ్రెడ్ మీద తేనె రాసి తీసుకుంటే చాలా చక్కగా బలాన్ని ఇస్తుంది ఆకలి తీరుతుంది.
ఒక క్యారెట్ ముక్క, ఒక ముల్లంగి ముక్క, ఒక బీట్రూట్ ముక్క, ఒక పండు టమాటా, చక్కగా ముక్కలు చేసి దాని మీద కొత్తిమీరని కత్తిరించి వాటి మీద చల్లి అల్పాహారంగా తీసుకొని ఒక tea స్పూన్ తేనే నాకితే తిన్న అల్పాహారం త్వరగా జీర్ణం అవుతుంది.

-షేక్. బహార్ అలీ
 ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.