హెచ్‌సిఎ ఎన్నికలలో పోటీ చేయకుండా అజారుద్దీన్‌పై అనర్హత వేటు!

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) మాజి అధ్యక్షుడు అజారుద్దీన్ ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. అధ్యక్షుడిగా ఉండి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినందుకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటి అనర్హత వేటు వేసింది. హెచ్‌సిఎ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించింది. అజహరుద్దీన్‌ణ/ హెచ్‌సిఎ ఓటరు జాబితా నుండి తొలగిస్తూ కమిటి నిర్ణయం తీసుకుంది. హెచ్‌సిఎ , డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహరించారు. అజహరుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాల నేపథ్యంలో హెచ్‌సిఎ కు సంబందించి పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి.
హెచ్‌సిఎ అధికారి విఎస్ సంపత్ ఎన్నికలకు నోటిఫికేషన్ గత నెల 30న విడుదల చేశారు. ఈ నెల 11 నుండి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 14 వ తేదీన నామినేషన్ల పరిశీలన.. 16లోపు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. 20వ తేదీన పోలింగ్ నిర్వహించి.. అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు.