టిఎస్ఆర్‌టిసి ఐటిఐ: కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నది

హైదరాబాద్ (CLiC2NEWS): నగర శివారులోని హకీంపేటలో నూతనంగా టిఎస్ ఆర్‌టిసి ఐటిఐ కళాశాల ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అనుమతి కూడా వచ్చింది. పదో తరగతి విద్యార్హత కలిగిన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఈ కళాశాలలో మోటార్ వెహికల్ మెకానిక్ , మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లలో విద్యాబోధన జరుగుతుంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టిఎస్ ఆర్‌టిసి డిపోల్లో అప్రెంటిషిప్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ను అందించాలనే సంకల్పంతో ఈ కాలేజ్ని ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఐటిఐ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు 9100664452 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచంచారు.