లోయలోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం.. ఒకరు మృతి
పాడేరు (CLiC2NEWS): అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది ప్రయాణికులతో ఉన్న బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పాడేరు మండలం రాయికోట గ్రామం సమీపంలో బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లింది. వాహనంలో ఉన్న వారందరూ కూలిపనులు చేసుకొనేవారు. వీరు రాయికోట గ్రామం నుండి రాజమండ్రికి వెళుతున్నట్లు తెలుస్తోంది.