ప్రగతి పథంలో తెలంగాణ

కాలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రగతి పథంలో తెలంగాణ

ఖమ్మంః తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కాలెక్టరేట్ లో జాతీయ జెండాను మం్ర‌తి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ ప్ర‌వేశ‌పెట్టే ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌న్నారు. మ‌న ప‌థ‌కాల‌ను వివిధ రాష్ర్టాలు అనుస‌రిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో గ్రామాల రూపు రేఖలే మారిపోయాయన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో మంచినీటిని, విద్యుత్ ని సరఫరా చేయడమే కష్టంగా ఉండేదన్నారు. సర్పంచ్ ల ఐదేళ్ళ కాలం వీటికే సరిపోయేది కాదన్నారు. కానీ, నేటి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. అన్ని గ్రామాల్లో అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు.

గ్రామాల్లో నిరంతరాయంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్యకరమైన, శుద్ధి చేసిన మంచినీరు అందుతుందన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కొత్త భవనాలు, అంతర్గత రోడ్లు, చెత్తను వేరు చేసే డంపు యార్డులు, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ, వైకుంఠ దామాలు, ప్రకృతి వనాలు, నర్సరీలు, హరిత హారాలు, ఉపాధి హామీ కింద అనేక రకాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఇవేగాక రైతులకు రైతు వేదికలు, కల్లాలు వంటి మరెన్నో పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు.

ఇవేగాక పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేయడం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ఇంకా నిధులు ఇస్తున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఉపాధి హామీ కింద కరోనా కారణంగా ఊళ్ళకు వచ్చిన కూలీలకు కొత్తగా జాబ్ కార్డులిచ్చి మరీ, ఉపాధి కల్పించిన ఘతన సీఎం కెసిఆర్ గారిదేనని చెప్పారు.

ఎన్నడూ లేని విధంగా కరోనా కష్ట కాలంలో రైతాంగాన్ని ఆదుకుని రూ.30వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతాంగానికి సాగునీరు, 24 గంటలపాటు ఉచిత విద్యుత్ తోపాటు రుణ మాఫీలు, రైతాంగానికి పంటల పెట్టుబడులు కూడా ఇస్తున్నామని వివరించారు.

పేదలకు ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, సూక్ష్మ రుణాలు, ఉచిత చేప పిల్లల పంపిణీ ఇలా ప్రతి వర్గానికి నిలిచి వారి ఆర్థికస్వాలంబన కు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

పల్లెల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సిఎం కెసిఆర్ గారి నిర్దేశంలో తామంతా పని చేస్తున్నామని మంత్రి పువ్వాడ  చెప్పారు. పల్లెల పట్ల ఇంత ప్రేమాప్యాయతలను కనబరచిన ఇలాంటి సీఎంని తాను ఎన్నడూ చూడలేదన్నారు.

Comments are closed.