మత్స్యకారుల బోటులో అగ్నిప్రమాదం..

కాకినాడ (CLiC2NEWS): సముద్రంలోకి వేటకు వెళ్లిన బోటులో అగ్నిప్రమాదం జరిగింది. కాకినాడ తీరంలో 11 మంది మత్స్యకారులుతో వేటకు వెళ్లిన బోటు ప్రమాదానికి గురైంది. గ్యాస్ సిలెండర్ పేలి మంటలు వ్యాపించాయి. వారు వెంటనే కాకినాడ తీరంలోని గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 11 మంది మత్స్యకారులను రక్షించినట్లు సమాచారం.
చేపలవేటకు వెళుతున్న మత్స్యకారులు భోజన అవసరాలకు సరిపడా నిత్యావసరాలు, గ్యాస్ సిలెండర్ తదితర వస్తువులను వెంటతీసుకెళ్తుంటారు. ఎప్పటిలాగానే వెళ్లిన మత్స్యాకారులు తిరిగి వస్తున్న క్రమంలో గ్యాస్ సిలెండర్ పేలి.. బోటులో మంటలు వ్యాపించాయి.