బతుకమ్మా మళ్ళీ రావమ్మా..
పువ్వు పువ్వుకో పరిమళం
పువ్వు పువ్వు కో సోయగం
సంపంగి, పారిజాతాలు
మాకు లేకున్నా
గునుగు,తంగేడు పువ్వులేమాకు మిన్న
ప్రకృతి పువ్వులు
మాకు సిరిసంపదలు
ఒక్కేసి పువ్వేసి..
అందరిని కలగలిపి హాయిగా ఆడుకుంటాం
వాయినాలు ఇచ్చుకుంటాం
సత్తుపిండి, సమిలి సిమిలి ముద్దలు బొజ్జ నిండా తింటాం
అన్నా, తమ్ములు
హాయిగా ఉండాలని
దీవిస్తాం
పుట్టింటి చీరకే మురిసిపోతాం
మొగుడు తెచ్చిన పట్టుచీర వల్లనంటాం
పుట్టింట,మెట్టినింట
బతుకును ఇవ్వమ్మా
బంగారు బతుకమ్మ
మళ్ళీ రావమ్మా
-ఎస్. వి రమణా చార్యులు