Telangana CM: ఇంకా కొలిక్కిరాని చర్చలు..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత (CLP leader) ను ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానానికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక నిర్ణయాన్ని ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని అధిష్టానానికి పంపించారు. అధిష్టానం తీర్మానాన్ని అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ అధిష్టానం నుండి ఇంకా స్ఫష్టమైన ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు లేనట్లేనని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.