ఓ మ‌హిళ ఆత్మహ‌త్య కేసు.. పుష్ప న‌టుడు జ‌గ‌దీశ్‌(కేశ‌వ‌) అరెస్ట్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ప‌క్క‌న స‌హాయ న‌టుడి పాత్ర పోషించిన జ‌గ‌దీశ్ (కేశ‌వ‌)ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గ‌త నెల 29వ తేదీన ఓ మ‌హిళ (జూనియ‌ర్ అర్టిస్టు) ఆత్మ‌హ‌త్య చేసుకున్న కేసులో ద‌ర్యాప్తు చేసిన పోలీసులు బండారు జ‌గ‌దీశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. పంజాగుట్ట ప‌రిధిలో ఉంటున్న ఓ మ‌హిళ.. ఓ వ్య‌క్తితో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌దీశ్ ఫోటోలు తీసి ఆమెను బెదించిన‌ట్లు స‌మాచారం. ఫోటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్టు చేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో మ‌న‌స్తాపానికి గురైన మ‌హిళ ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలుసుకున్న పోలీసులు జ‌గ‌దీశ్‌ను బుధ‌వారం అరెస్టు చేశారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌కు జ‌గ‌దీశ్‌కు సినీ రంగంలో ప‌రిచ‌యం ఉంద‌ని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.