సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులుండవు: కిషన్‌రెడ్డి
![](https://clic2news.com/wp-content/uploads/2022/01/kishanreddy.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బిజిపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత భారత్, విశ్వకర్మ పథాకాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవని, రాష్ట్రంలో బిజెసి ఒటంరిగానే పోటీ చేస్తుందన్నారు.
డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జిపి నడ్డా రాష్ట్రానికి రానున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ శనివారం నుండి రాష్ట్రంలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.