అరుణాచల క్షేత్రానికి టిఎస్ఆర్‌టిసి సూపర్ లగ్జరి బస్సులు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరం నుండి అరుణాచల పుణ్య క్షేత్రానికి టిఎస్ ఆర్‌టిసి సూపర్ లగ్జరి బస్సులను నడపనుంది. డిసెంబర్ 26 పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను నడపడానికి నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్ నగర భక్తులు ఎంజిబిఎస్, జెబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, జంట నగారాల్లోని సమీప ఆర్‌టిసి కేంద్రాల వద్ద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ఒక్కొక్కరికి రూ. 3690 గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన పర్తి వివరాలు ఆర్‌టిసి వైబ్‌సైట్‌లో ఉంచారు. భక్తులు 99592 26257, 99592 24911, 99592 26246 నంబర్లను సంప్రదించగలరు.
డిసెంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటలకు ఎంజిబిఎస్‌లో బస్సు బయలుదేరుతుంది. కాణిపాక విఘ్నేశ్వరుడి దర్శనం, వేలూరులోని స్వర్ణ దేవాలయ సందర్శన అనంతరం 25 వ తేదీ రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. 26న గిరి ప్రదక్షణ తర్వాత 27వ తేదీ తిరిగి ఎంజిబిఎస్‌కు చేరుకుంటుంది.