హైదరాబాద్లో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/drinking-water-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాలకు జనవరి 3వ తేదీన మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై మెయిన్ పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా నల్గొండ – ఓవైసీ డౌన్ ర్యాంప్ అలైన్ మెంట్ లో ఉన్న సంతోష్ నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. దీని వలన జనవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కావున వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
మిరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మన్ గఢ్, యాకుత్ పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, రియాసత్ నగర్, ఆలియాబాద్, బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలుకల గూడ, దిల్ సుఖ్ నగర్ ప్రాంతం, బొంగులూరు, మన్నెగూడ.