ఖమ్మం: జిల్లాలో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన

ఖమ్మం (CLiC2NEWS): జిల్లాలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మాణం జరుగుతుంది. ఈ వంతెన గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. అటుగా వెళుతున్న వాహనదారులు భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైనట్లు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.