రైలు – ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణికుడు

వికారాబాద్ (CLiC2NEWS): కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో అదుపుతప్పి రైలు-ప్లాట్‌ఫాం మధ్యలో ప్రయాణికుడు పడిపోయాడు. గమనించిన సిబ్బంది రైలును ఆపి.. ప్రయాణికుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్లాట్‌ఫాంను పగులగొట్టి అతన్ని బయటకు తీశారు.
సుమారు 2 గంటల పాటు ఆ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. సదరు ప్రయాణికుడు రాయచూర్‌కు చెందిన సతీశ్‌గా గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీకి తరలించారు.