APPSC: ఎపి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో 7 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

APPSC: ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో 7 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బిఆర్క్ లేదా బిఇ, బిటెక్ సివిల్) లేదా బిప్లానింగ్ / బిటెక్ (ప్లానింగ్) లేదా ఎంఎ జాగ్రఫి, పిజి లేదా టౌన్ ప్లానింగ్‌లో డిప్లమో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు జులై 2024 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుం రూ. 370గా నిర్ణయించారు. ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ వారు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీనుండి ఏప్రిల్ 10వ తేదీవరకు
దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సి టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.