దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభించిన ప్రధాని

ద్వారక (CLiC2NEWS): గుజరాత్లోని ద్వారకలో నిర్మించిన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. దేశంలోనే అతి పొడవైన ఈ వంతెనకు సుదర్శన్సేతు అని పేరు పెట్టారు. దీని పొడవు 2.3 కిలోమీటర్లు. దీనిని రూ. 979 కోట్ల వ్యవయంతో నిర్మించారు. ఈ వంతెన ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉండనున్నట్లు సమాచారం.
The Sudarshan Setu, which would be inaugurated by PM @narendramodi in a short while! pic.twitter.com/zF5RbvaYoN
— PMO India (@PMOIndia) February 25, 2024