AP: 20 మంది వైఎస్ఆర్సిపి నేతలకు గన్మెన్ల తొలగింపు

అమరావతి (CLiC2NEWS): ఎపి ప్రభుత్వం 20 మంది వైఎస్ఆర్సిపి నేతలకు గన్మెన్లను తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివిక్ష చూపుతుందంటూ ఇసికి ఫిర్యాదు చేశారు. దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను కోరారు. ఇసి ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అధికార పార్టీ వారికి 2+2 నుండి 4+4 వరకు గన్మెన్లను కేటాయించారని.. ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.