హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. గురువారం ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కింది తెల‌పిన ప్రాంతాల్లో పాక్షికంగా.. ప‌లు ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంత‌రాయం కలగనున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. కావున వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగల‌రని కోరుతున్నారు.

అంత‌రాయం కలిగే ప్రాంతాలు:

ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్ (లో వాట‌ర్ ప్రెజ‌ర్)

ఆఫ్ టేక్ పాయింట్స్, బ‌ల్క్ క‌నెక్ష‌న్స్

హైద‌ర్ న‌గ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలోని.. కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్య‌న‌గ‌ర్ కాల‌నీ, వ‌సంత న‌గ‌ర్.

ఆర్.సి పురం. అశోక్ న‌గ‌ర్, జ్యోతిన‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, దీప్తి శ్రీ న‌గ‌ర్, మ‌దీనాగూడ‌, మియాపూర్ తో పాటు మంజీరా ఫేజ్ – 1 లోని ఆన్ లైన్ స‌ప్లైలు.

బీరంగూడ‌, అమీన్ పుర్, బొల్లారం.

Leave A Reply

Your email address will not be published.