పసిడి ధర పైపైకి..
రూ. 67 వేలు దాటిన బంగారం ధర

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో బంగారం ధర పైపైకి పోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. దీంతో దేశంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. 24 గ్రా స్వచ్చమైన బంగారం ధర రూ. 67వేలకు పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి బులియన్ విపణిలో రూ. 67, 200 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 74,900 వద్ద కొనసాగుతోంది.