‘కలలకు రెక్కలు’ పథకం.. ప్రకటించిన నారా భువనేశ్వరి

కర్నూలు (CLiC2NEWS): ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థినులు ఉన్నత చుదువుల కోసం కలలకు రెక్కలు పథకంను నారా భువనేశ్వరి ప్రకటించారు. ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి వడ్డీలేని బ్యాంకు రుణాలు ఇవ్వనున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా టిడిపి అధినేత సతీమణి నారా భువనేశ్వరి కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పర్యటించారు. ఈ సందర్భంగా యువతో నిర్వహించిన కార్యాక్రమంలో పాల్గొన్న ఆమె కలలకు రెక్కలు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ వథకంలో ప్రభుత్వ గ్యారెంటీతో ఇచ్చే బ్యాంకు రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె తెలిపారు.