నలుగురికి ప్రాణదానం చేశాడు..
వారిలో శ్రీకాంత్ జీవించే ఉన్నారు..

మండపేట: పట్టణ ప్రముఖుడు బిక్కిన చక్రవర్తి ఏకైక కుమారుడు శ్రీకాంత్ ఇటీవల వెదురుమూడి గ్రామంలో ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రాజమహేంద్రవరం లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు కోమాలో వుంటూ తుది శ్వాసను విడిచారు. శ్రీకాంత్ తండ్రి చక్రవర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరికి స్వయాన సోదరుని కుమారుడు. అపస్మారక స్థితి లో శ్రీకాంత్ నెల రోజుల పాటు ఉన్న శ్రీకాంత్ బ్రతకడని తెలుసుకున్న తల్లిదండ్రులు అవయవాలను మరో నలుగురికి దానం ఇచ్చి ఆ నలుగురికి ప్రాణం పోశారు. హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన ప్రత్యేక ఆపరేషన్ లో శ్రీకాంత్ కిడ్నీలు ఇద్దరికి, లివర్ ఒకరికి, గుండె మరొకరికి అందజేశారు. గుండె మార్పిడి జరిగిన వెంటనే శ్రీకాంత్ తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా శ్రీకాంత్ ఆరోగ్యం కోలుకోవాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పలు ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాజబాబు శ్రీకాంత్ సమీప బంధువు. శుక్రవారం శ్రీకాంత్ మరణంతో పట్టణంలో బిక్కిన కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.
-టి.వి.గోవిందరావు